twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహానటి’ ఎఫెక్ట్: అల్లు అర్జున్ రెస్ట్‌లెస్... నిద్ర మాత్రలు వేసుకున్న వైనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Allu Arjun Praises Mahanati Movie Team

    అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' చిత్రానికి కేవలం 5 రోజుల గ్యాపుతో విడుదలైన 'మహానటి' సూపర్ డూపర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'మహానటి' చిత్రబృందాన్ని పిలిచి అల్లు అరవింద్, అల్లు అర్జున్ పార్టీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ పార్టీలో పాల్గొన్న బన్నీ చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశం అయ్యాయి. 'మహానటి' చూసిన తర్వాత బన్నీ రెస్ట్‌లెస్‌గా మారారట. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. చివరకు నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోవాల్సి వచ్చిందట. అయినా కూడా సరిగా నిద్రపట్టలేదని బన్నీ వెల్లడించారు.

    కంగ్రాట్స్‌, సూపర్‌హిట్‌, బ్లాక్‌బస్టర్‌ అని పిచ్చి మాటలు చెప్పాలనుకోలేదు

    కంగ్రాట్స్‌, సూపర్‌హిట్‌, బ్లాక్‌బస్టర్‌ అని పిచ్చి మాటలు చెప్పాలనుకోలేదు

    అల్లు అర్జున్ మాట్లాడుతూ...‘సినిమా చూసిన తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్‌కి ఫోన్‌ చేసినప్పుడు కంగ్రాట్స్‌, సూపర్‌హిట్‌, బ్లాక్‌బస్టర్‌ వంటి పిచ్చి పదాలు వాడాలనుకోలేదు. ఇలాంటి సినిమా తీసినందుకు థాంక్స్ చెప్పి అందరం గర్వపడే సినిమా తీశావని చెప్పాలనుకున్నాను' అని బన్నీ తెలిపారు.

    సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టలేదు

    సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టలేదు

    సినిమా చూసిన తర్వాత అసలు నాకు నిద్రపట్టలేదు. ఇది నేను వేలాకోలానికి చెప్పడం లేదు. నా జీవితంలో ఫస్ట్ టైమ్ జెట్‌ల్యాగ్‌ ట్యాబ్లెట్‌(నిద్రమాత్ర) వేసుకుని నిద్రపోయాను. అది వేసుకుని రాత్రి 1.30 గంటలకు పడుకున్నాను. అయినా ఉదయం 5.30కు మెలకువ వచ్చేసింది. ‘మహానటి' సినిమా అంత బాగా నచ్చింది కాబట్టే నిద్ర పట్టలేదు... అని అల్లు అర్జున్ తెలిపారు.

    మంచి స్క్రిప్టు ఉంటే అయస్కాంతంలా అన్నీ అతుక్కుంటాయి

    మంచి స్క్రిప్టు ఉంటే అయస్కాంతంలా అన్నీ అతుక్కుంటాయి

    వివి వినాయక్ గారు నాకు ఒక మంచి మాట చెప్పారు. ఒక మంచి స్క్రిప్టు ఉంటే దానికి అయస్కాంతం లాగా అన్నీ మంచి విషయాలే వచ్చి అంటుకుంటాయి. మంచి కెమెరామెన్, మంచి యాక్టర్లు, ఇలా అన్నీ సూపర్ గా సెట్టవుతాయన్నారు. ‘మహానటి' సినిమా చూసినపుడు నాకు ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి... అని బన్నీ తెలిపారు.

    వేరేవాళ్లు తీసుంటే ఇలా వచ్చేది కాదు

    వేరేవాళ్లు తీసుంటే ఇలా వచ్చేది కాదు

    ఈ సినిమా మీరు తప్ప ఎవరు తీసినా ఇలా ఉండదు. క్యాలిక్యులేషన్స్, మ్యాడ్ నెస్, జెన్యూనిటీ అన్ని మీలో ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. చాలా నిజాయతీగా తీశారు. లెక్కపెట్టి తీస్తే లెక్కే వస్తుంది. లెక్కపెట్టకుండా తీస్తే లెక్కలేనంత వస్తుంది. అందుకు చక్కటి ఉదాహరణ ‘బాహుబలి'. ఆ సినిమా లెక్క పెట్టకుండా తీశారు కాబట్టే లెక్కలేనంత డబ్బు వచ్చిందని బన్నీ తెలిపారు.

    కలెక్షన్లతో పోల్చొద్దు, వెల్లకట్టలేని సినిమాలు

    నా జీవితంలో చాలా తక్కువ సినిమాలు బాగా నచ్చాయి. ‘బాహుబలి', ‘బాహుబలి 2', ‘మనం', ‘అర్జున్‌ రెడ్డి' ఇప్పుడు ‘మహానటి'. సినిమా అంటే నంబర్ కాదు... అదొక అనుభూతి. అదొక టైమ్ లైస్ ఎక్స్ పీరియన్స్. నంబర్లు(వసూళ్లు)తో పోల్చి సినిమా క్వాలిటీని అగౌరవ పరచవద్దు. మహానటి లాంటి చిత్రాలు వెలకట్టలేనివి... అని బన్నీ తెలిపారు.

    English summary
    Here is Allu Arjun Superb Speech At Mahanati Success Celebrations. The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. #Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X