twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బావ జూ.ఎన్టీఆర్‌కి, చరణ్‌కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్‌దే.. అల్లు అర్జున్!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. గీత గోవిందం తరువాత మరోమారు బన్నీ విజయ్ దేవరకొండ సినిమా ఫంక్షన్ లో మెరిశాడు. నవంబర్ 17 న టాక్సీవాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ ప్రీరిలీజ్ వేడుకలో అభిమానులని అలరించే ప్రసంగం చేసాడు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రీరిలీజ్ వేడుకలో బన్నీ తెలిపిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

    మొదట గౌరవించాల్సింది వారినే

    మొదట గౌరవించాల్సింది వారినే

    సినిమా వెనుక రచయితల కష్టం చాలా ఉంటుంది. కానీ వారికి సరైన గుర్తింపు దక్కదు అని బన్నీ అభిప్రాయపడ్డాడు. అందువలన తాను మొదట రచయితలని, సాహిత్యం అందించిన వారిని ఎక్కువగా గౌరవిస్తానని బన్నీ తెలిపాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ.. నీ డ్రెస్ అదిరింది అని సరదాగా వ్యాఖ్యానించాడు.

    ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం

    ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం


    హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి మాట్లాడుతూ బన్నీ చాలా సరదాగా జోకులు వేశాడు. ప్రియాంక గురించి తెలుసుకున్నాను. ఆమె మరాఠి అమ్మాయి. కానీ పెరిగింది మాత్రం అనంతపూర్ లో అని బన్నీ తెలిపాడు. తెలుగుని గురవించేవాళ్ళు ఎవరైనా తెలుగువారే. ప్రియాంక మాట్లాడుతూ నాపై ప్రేమ ఉందని తెలిపింది. ఆ విషయం ఇప్పుడు చెప్పి ఎం ప్రయోజనం అంటూ బన్నీ సరదాగా వ్యాఖ్యానించాడు.

    మీటూ చూసినప్పుడు అనిపిస్తుంది

    మీటూ చూసినప్పుడు అనిపిస్తుంది

    మీటూ లాంటి ఉద్యమాలు చూసినప్పుడు అనిపిస్తుంది. అన్ని చిత్ర పరిశ్రమల్లోకల్లా తెలుగు పరిశ్రమ చాలా క్లీన్ అని బన్నీ తెలిపాడు. ఇక్కడ అమ్మాయిలకు చాలా గౌరవం ఉంటుంది. ధైర్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీకి రావచ్చు అని బన్నీ అభిప్రాయపడ్డారు.

    ఆ క్రెడిట్ శిరీష్‌దే

    ఆ క్రెడిట్ శిరీష్‌దే

    మెగా అభిమానులతో తమ్ముడు శిరీష్ చాలా బాగా టచ్ లో ఉంటాడు. అభిమానులని గుర్తించే క్రెడిట్ అతడికే ఇవ్వాలి. ఈ చిత్ర నిర్మాత ఎస్కెఎన్ ని నాకు పరిచయం చేసింది శిరీషే అని బన్నీ తెలిపాడు. ఆయన్ని తొలిసారి ఇందిరా ఫంక్షన్ లో కలిశానని బన్నీ తెలిపాడు. ఎస్కెఎన్ హార్డ్ కొర్ మెగా అభిమాని అని బన్నీ అన్నాడు.

    భాగమతి తరువాత

    భాగమతి తరువాత

    నేను సాధారణంగా నిర్మాతలని ముందుగా నిర్ణయించుకోను. కానీ భాగమతి తరువాత యువి క్రియేషన్స్ వారిని పిలిచి మరీ అడిగా.. మనం ఒక సినిమా చేయాలని అని బన్నీ తెలిపాడు.

    బావ జూ.ఎన్టీఆర్‌కి

    బావ జూ.ఎన్టీఆర్‌కి

    విజయ్ దేవర కొండ గురించి మాట్లాడే ముందు మీకొక విషయం చెప్పాలి. ఈ రోజే ట్రిపుల్ ఆర్ చిత్రం లాంచ్ అయింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు, నేను సరదాగా బావా అని పిలిచే ఎన్టీఆర్ కి, తెలుగు సినిమాకు గర్వకారణమైన రాజమౌళి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ బన్నీ తెలిపాడు. దీనితో అక్కడ ఉన్నా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

    బన్నీ అన్న లాగా డాన్స్ చేయలేను అని

    బన్నీ అన్న లాగా డాన్స్ చేయలేను అని

    విజయ్ దేవరకొండ బన్నీ అన్నలాగా డాన్సులు చేయాలను.. కానీ జనాలకు ఎందుకో నచ్చేశా అని అన్నాడు. విజయ్ దేవరకొండ ఎలాంటి సందర్భంలో అయినా ఒకేలా ఉంటాడు. అతడిలో ఓ వరిజినాలిటీ ఉంది. అందుకే అందరికి విజయ్ నచ్చేశాడు అని బన్నీ తెలిపాడు.

    ప్లాప్ కావాలని కోరుకునేవారు

    ప్లాప్ కావాలని కోరుకునేవారు


    విజయ్ దేవరకొండ సినిమాలు ప్లాప్ కావాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ ఇంత త్వరగా ఎదుగుతుండడంతో ఓర్వలేక కొంతమంది అతడికి నెగిటివ్ గా కూడా ఉన్నారని బన్నీ తెలిపాడు. కానీ తనలాగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీకి సింపుల్ గా రాలేదు. కష్టపడుతూ ఎదుగుతున్నడని ప్రశంసించాడు.

    English summary
    Allu Arjun superb Speech Taxiwala Pre Release Event. Allu Arjun wishes to RRR movie team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X