అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి మూవీ డిటేల్స్
నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications












