‘హ్యాపీడేస్’ నుంచే తమన్నాపై కన్నేసాను అంటున్న అల్లు అర్జున్
తమన్నా నటన అద్భుతం. 'హ్యాపీడేస్" నుంచే తనతో సినిమా చేయాలని అనుకున్నాం. అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం! '100 పర్సంట్ లవ్"తో మా బేనర్‌లో చేసింది. 'బద్రినాధ్"లో నా సరసన చేసి అలరిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. క్రిందటి శుక్రవారం విడుదలైన బద్రినాధ్ చిత్రం ప్రమోట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు.అలాగే తొలివారం వసూళ్లలో నా సినిమాలన్నిటిలో ఇదే టాప్. టాలీవుడ్ టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందన్న నమ్మకముంది అని, ప్రారంభంలో కొంత డివైడ్ టాక్ వచ్చినా..ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు. కేరళ, కర్నాటకలలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలిసారి బద్రినాథ్‌గా పొడవైన హెయిర్‌తో కనిపించాను. అలాగే దర్శకుడు వినాయక్‌తో నా రెండో సినిమా ఇది. తను బెస్ట్ మాస్ డైరెక్టర్. ప్రణాళికాబద్ధంగా సినిమా తీయడంలో వినయ్ సిద్ధహస్తుడు. ఇక మా సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఇలానే కొనసాగితే నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రమవుతుందీ అన్నాడు.


Click it and Unblock the Notifications











