అల్లు అర్జున్ కూడా మిగతా హీరోలకు తీసుకుపోనట్లు తమ పార్టీ ప్రచారానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయమై చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. బన్ని పుట్టిన రోజైన ఏప్రియల్ ఎనిమిది నుంచి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమ మామయ్య పోటీచేస్తున్న పాలకొల్లు నుంచి ప్రారంభించనున్నారు. గతంలో కూడా తెలుగు సినిమా వజ్రోత్సవ ఉత్సవాల్లోనూ, మిగతా కాంట్రావర్శి సందర్భాల్లోనూ అల్లు అర్జున్ తన మామయ్య పక్షాన నిలబడ్డారు. దాంతో అతను తన వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకుంటాడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదైమైనా దూరంగా ఉంటాడనుకున్న బన్ని కూడా మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చినట్లే.