Allu Arjun పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగే!
RX100, మహాసముద్రం చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ చిత్రంలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవల రిలీజైన మంగళవారం సినిమా టీజర్, ట్రైలర్ భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో నవంబర్ 17వ తేదీన తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది.

మంగళవారం సినిమా ప్రమోషన్‌లో భాగంగా నవంబర్ 11వ తేదీన... శనివారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది.
మంగళవారం సినిమాలోని మూడు పాటలను కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభించింది. RX100 తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్
ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి
ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి
ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ
సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : రాజా కృష్ణన్
కొరియోగ్రఫీ : భాను
కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి
నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి


Click it and Unblock the Notifications











