అల్లు అర్జున్ కి బాలచంద్రుడి బ్రేక్
అల్లు అరవింద్ తన తన తనయుడు అల్లు అర్జున్ తో 'మగధీర" తీయకపోవడంలోని ఆంతర్యం? రామ్ చరణ్, అల్లు అర్జన్ చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగారు, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటే, ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడం, ఇలా చాలా ఉన్నాయి. మగధీరలో చరణ్ చేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ ప్రపోజ్ చేశాడని అంటారు.
ఇంతటి భారీ విజయాన్ని సాధించిన 'మగధీర"ని తన లక్ గా భావిస్తున్నానన్నాడు అల్లు అరవింద్. తన మేనల్లుడు రామ్ చరణ్ తో మగధీర చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ ఈ సారి తన కొడుకు అల్లు అర్జున్ తో ఈ తరహా చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాడట. పల్నాటి యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చేయాలనుకుంటున్నాడని వినికిడి. పల్నాడు యుద్ధంలో బాలచంద్రుడిది కీలక పాత్ర అన్న సంగతి ఆ చరిత్ర తెలిపినవారికి తెలిసే ఉంటుంది.
ఈ బాలచంద్రుడి పాత్రని అల్లు అర్జన్ చేస్తాడట. ఇంకా దర్శకుడు నిర్ణయం కాని ఈ చిత్రాన్ని 2011లో ఆరంభిచాలనుకుంటున్నారని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











