అల్లు అర్జున్, సుకుమార్ చిత్రం.. బర్త్ డే సందర్భంగా మరో క్రేజీ న్యూస్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 36వ జన్మదినం నేడు. అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో అతడి పుట్టిన రోజు వేడుకని ట్రెండ్ చేస్తున్నారు. 2003 సంవత్సరంలో అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ప్రతి చిత్రంలో తనని తాను మలుచుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం బన్నీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మలయాళీ చిత్ర పరిశ్రమలో కూడా స్టార్ హీరోనే. అంతలా అల్లు అర్జున్ క్రేజ్ పెరిగింది. నా పేరు సూర్య చిత్రంలో బన్నీ చివరగా నటించాడు. ఆ చిత్రం తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి మాత్రం ప్రకటన వచ్చింది. నేడు బన్నీ పుట్టిన రోజు సంధర్భంగా అల్లు అర్జున్ తదుపరి చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర ప్రకటనలు వస్తున్నాయి.

సుకుమార్ దర్శత్వంలో
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి కొన్ని రోజుల క్రితం ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ బన్నీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. త్వరలో అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించబోతున్నాడు. ఇదిలా ఉండగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ కు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

క్రేజీ టైటిల్
త్రివిక్రమ్ చిత్రం తర్వాత బన్నీ ముందుగా సుకుమార్ చిత్రాన్ని ప్రారంభిస్తాడా లేక వేణు శ్రీరామ్ చిత్రాన్ని ప్రారంభిస్తాడా అనేది వేచి చూడాలి. కానీ ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఐకాన్.. కనబడుటలేదు అనే ఆసక్తికరమైన టైటిల్ ని ప్రకటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

బన్నీకి జోడిగా
సౌత్ లో ప్రస్తుతం రష్మిక మందన పేరు హాట్ టాపిక్ గా మారుతోంది. క్రేజీ చిత్రాలన్నీ ఆమె బుట్టలో పడుతున్నాయి. గీత గోవిందం చిత్రంతో కుర్రాళ్లని మాయ చేసిన రష్మిక ప్రస్తుతం కొన్ని చిత్రాలతో బిజీగా గడుపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ చిత్రంలో హీరోయిన్ గా రష్మికని ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రష్మిక ట్వీట్ చేసింది.

మహేష్ బాబుతో
రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వలన ఆ చిత్రం ఆగిపోయింది. వెంటనే సుకుమార్ బన్నీ చిత్రాన్ని ప్రకటించాడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బన్నీకి సరిపడే కథని సిద్ధం చేయడంలో సుకుమార్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాడు.


Click it and Unblock the Notifications











