మామా నేను వస్తున్నా... అల్లు అర్జున్ ఫినిషింగ్ టచ్... బరిలోకి స్టైలిష్ స్టార్!

Recommended Video

Allu Arjun Going To Meet Pawan Kalyan,All Set To Support Janasena || Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం వేసవిని తలపిస్తూ వేడివేడిగా సాగుతున్నది. రాజకీయ నేతల పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావారణం హీటెక్కింది. గత కొద్దికాలంగా ప్రచారంలో విస్త‌ృతంగా పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ డీ హైడ్రేషన్‌తో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారు. దాంతో ప్రచారానికి పవన్ దూరం కావడం జనసేన కార్యకర్తల్లో ఆందోళన నింపింది. ఈ క్రమంలో సినీ తారలు రాంచరణ్ ఇప్పటికే బాబాయ్ పవన్ కల్యాణ్‌ను పరామర్శించగా... అల్లు అర్జున్ మంగళవారం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళితే..

పవన్‌కు రాంచరణ్ పరామర్శ

పవన్‌కు రాంచరణ్ పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన పవన్ కల్యాణ్‌ను కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా కలిసి పరామర్శిస్తున్నారు. RRR షూటింగ్‌లో గాయపడిన రాంచరణ్ తన బాబాయ్‌ హాస్పిటల్‌లో చేరారనే విషయంతో తనకు గాయమైందనే విషయాన్ని పక్కన పెట్టి విజయవాడకు వెళ్లారు. పవన్ నివాసంలో కలిసి పరామర్శించి కాసేపు పార్టీ కార్యాలయంలో కలియదిరిగారు.

పాలకొల్లులో అల్లు అర్జున్‌ పర్యటన

పాలకొల్లులో అల్లు అర్జున్‌ పర్యటన

ఇక పవన్ కల్యాణ్‌ను కలుసుకొనేందుకు అల్లు అర్జున్ కూడా రెడీ అయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి రాజమండ్రికి చేరుకొంటారు. ఆ తర్వాత పాలకొల్లులో పవన్ కల్యాణ్‌ను కలిసి పరామర్శిస్తారు. అక్కడ నుంచి అభిమానులను కలుసుకొనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తన టూర్ ప్లాన్‌ను పక్కాగా ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారం.

జనసేనకు బహిరంగ ప్రచారం

జనసేనకు బహిరంగ ప్రచారం

మెగా, అల్లు అభిమానులను కలుసుకొనే సమావేశంలో జనసేనకు బహిరంగంగా మద్దతు తెలుపుతారు. భీమవరంలో పవన్ కల్యాణ్‌ను, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కే నాగబాబును గెలిపించాలని అభిమానులను కోరుతారు. అంతేకాకుండా జనసేన పార్టీకీ మద్దతు తెలిపాలని ప్రజలకు అల్లు అర్జున్ కోరే అవకాశం ఉంది. చివరి రోజున ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది.

తండ్రి విజయం కోసం నిహారిక

తండ్రి విజయం కోసం నిహారిక

ఇప్పటికే నర్సాపురం పార్లమెంట్‌ పరిధిలో మెగా డాటర్ నిహారిక తండ్రి నాగబాబు విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మెగా అభిమానులు ఇప్పటికే నరసాపురం, భీమవరం, గాజువాక, ఇతర నియోజకవర్గాలకు చేరుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X