త్రివిక్రమ్ సినిమాకి డోస్ పెంచుతున్న అల్లు అర్జున్...!?
వరుడు, వేదం వంటి ఆఫ్ బీట్ చిత్రాలు, బద్రినాథ్ వంటి హేవీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలు చేసి బోర్ కొట్టిందో ఏమో..కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఓ పూర్తి వినోదాత్మక చిత్రం చేయడానికి సిద్దమయ్యాడు. ఇక తన తదుపరి చిత్రంలో కామెడీ డోసును పెంచాలని నిర్ణయించుకున్నాడు అర్జున్. ఇందుకు రంగం కూడా సిద్దమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దేశముదురు నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ లో నిర్మిస్తారు. గత నాలుగు నెలల నుంచి ప్రొసెస్ లో వున్న ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
జూలై మూడో వారం నుంచి సెట్టస్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా ఇలియానా పేరు వినిపించింది. 'శక్తి" సినిమా నిర్మాణంలో వుండగా ఇలియానాను ఈ ప్రాజెక్ట్ కోసం అడిగితే, ఏకంగా కోటిన్నర్ డిమాండ్ చేసిందామె. అప్పట్టో చూద్దాం..అని ఆలోచించినా, ఇలియానా పేరు పక్కన పడేసి, ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ పేరు పరిశీలిస్తున్నారట ఈ చిత్ర దర్శక నిర్మాతులు..
ఆల్రెడీ 'ఆర్య 2"లో కాజల్ తో కలిసి నటించిన బన్నీ, మళ్ళీ మరో మారు ఆమెతో జతకట్టేందుకు తహతహలాడుతున్నట్టు సమాచారం. ఆ కోణంలో చూస్తే, బన్నీ తదుపరి చిత్రంలో కాజల్ పేరు దాదాపు ఖాయమే. 'ఖలేజా"తో సాక్ తిన్న త్రివిక్రమ్ ఈసారి మాత్రం బన్నీ సినిమా విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వున్నాడనీ, స్క్రిప్ట్ పక్కాగా ప్రిపేర్ అయ్యిందనీ, షెడ్యూల్ ప్రకారం సినిమా చేయనున్నాడనీ సమాచారం. సినిమా షూటింగ్ జూలై 3వ వారంలో ఆరంభంమైవుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











