బన్నీ దెబ్బకు తల పట్టుకున్న త్రివిక్రమ్
అసలే ఖలేజా రిలీజయ్యి చాలా కాలం అయ్యింది..అందులోనూ తనమీద చాలా స్లో గా సినిమాలు తీస్తాడనే ముద్ర ఉంది.వీటినుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యాడు.అయితే ఈ సారి హీరో వైపు నుంచి లేట్ అవుతూండటంతో త్రివిక్రమ్ తలపట్టుకు కూర్చోవల్సి వచ్చింది.అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం డిసెంబర్ నెలదాకా ప్రారంభం కాదని తెలుస్తోంది.మూడు నెలలు పాట షూటింగ్ లకు దూరంగా ఉండాలని చెప్పటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అలాగే చిత్రంలో విలన్ గా సుదీప్ ని ఎంపిక చేసారు. అలాగే మరో కీలకపాత్రకు ఐద్రిత రే అనే కన్నడ అమ్మాయిని సెలెక్టు చేసినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం లవ్ ఇన్ హైదరబాద్ అనే చిన్న చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్నికవటంతో ఆమె జాక్ పాట్ కొట్టినట్లయింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సర్జరీ చేయించుకోవటానికి ఆస్ట్రైలియా లోని పెర్త్ కి మొన్న (ఆదివారం, ఆగస్టు 14, 2011)రాత్రి ప్లైయిట్ కి వెళ్లారు. అక్కడ సర్జరీ చేయించుకుని నెల రోజులు పాటు రెస్ట్ తీసుకుని ఇండియాకు తిరిగివస్తారు. ఇక ఈ ప్రయాణంతో త్రివిక్రమ్ సినిమా మరో నెలకు వాయిదా పడింది. డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం నవంబర్ ఎండింగ్ కి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ సెట్స్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











