అల్లు అర్జున్ కొత్త చిత్రం పూజ జరిగింది

By Srikanya

హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్‌ చేయబోయే సినిమా ఖరారైంది. అల్లు అర్జున్‌తోనే ఆయన సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ రాధాకృష్ణ కొత్త ఆఫీసులో రీసెంట్ గా ఈ చిత్రానికి చెందిన పూజ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు.

ఇక ఇప్పటికే త్రివిక్రమ్‌ కథ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాకి వచ్చే నెలలోనే ఆఫీషియల్ గా సినీ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టబోతున్నట్టు తెలిసింది. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత.

జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ వార్తతో 'అత్తారింటికి దారేది' తరవాత త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించే సినిమా ఏది? హీరో ఎవరు? ఎన్టీఆర్‌తో చేస్తారా... లేదా? ఈ ప్రశ్నల పరంపరకు తెరపడినట్టే. ఎందుకంటే త్రివిక్రమ్‌ తరవాతి సినిమా అల్లుఅర్జున్‌తో ఖాయమైపోయింది. 'జులాయి' తరవాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొనే చిత్రమిదే. 'జులాయి' నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. కథ ఇప్పటికే సిద్ధమైందట. జనవరి నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రం ఫస్ట్ లుక్...డిసెంబర్ ఏడవ తేదీన విడుదల కానుంది. ఆ రోజు దర్శకుడు సురేంద్ర రెడ్డి పుట్టిన రోజు కావటంతో ఆ రోజే ఫస్ట్ లుక్ విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ కొత్త విడుదల తేదీ పిభ్రవరి 7 అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X