అలాంటి అపకీర్తి రావద్దనుకుంటున్న త్రివిక్రమ్!
హైదరాబాద్: దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా....పాపులారిటీ మాత్రం అంతకు పదింతలు అయింది. రచయితగా అడుగు పెట్టినప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు రచయితల్లో ఒకప్పుడు అందరికంటే ఎక్కువగా రూ. కోటి పారితోషికం తీసుకున్న ఘనత ఆయనది.
దర్శకుడిగానూ పరిశ్రమలో తనదైన ప్రభంజనం సృష్టించాడు. ఆయన సినిమాలకు కోట్లలో కలెక్షన్లు ఉంటాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే త్రివిక్రమ్‌కు మాత్రం ఓ విషయంలో చెడ్డ పేరుంది. ఆయన సినిమాలు చాలా లేటుగా తీస్తారు అనేది. ఆయన వల్ల ప్రొడక్షన్ కాస్టు కూడా పెరుగుతుందనే అపకీర్తి ఉంది.
జులాయి తర్వాత బన్నీతో తాజాగా మరో సినిమా చేస్తున్న త్రివిక్రమ్...ఈ సారి మాత్రం తనకు అలాంటి అపకీర్తి రాకూడదనే ఆలోచనలో ఉన్నారట. అందుకే శరవేగంగా షూటింగ్ కానిచ్చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. అని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఎస్.రాధాకృష్ణ తెలియజేశారు.
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెలాఖరుతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. డిసెంబర్లో పాటలు, ఫైట్లు చిత్రీకరిస్తాం. జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతాయి. మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, సింధు తులాని, వెన్నెల కిషోర్, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











