అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేదెప్పుడు?
'నా పేరు సూర్య' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కమిటైన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది కానీ... షూటింగ్ ఇంకా మొదలు కాక పోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొని ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్రిప్టుకు ఫినిషిట్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

బన్నీ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో బన్నీ-పూజా హెగ్డే డిజెలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిన క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన నేపథ్యంలో అభిమానులు వీరి కాంబినేషన్‌పై ఆసక్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











