అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన రేపే.. త్రివిక్రమ్ పై ఉత్కంఠ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. నా పేరు సూర్య నిరాశపరచడంతో ఈ సారి అభిమానులకు అదిరిపోయే చిత్రాన్ని అందించాలని బన్నీ భావిస్తున్నాడు. అందుకే మంచి కథ, దర్శకుడి కోసం ఇన్ని రోజులు ఎదురుచూశాడు.
ఎట్టకేలకు త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరో కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్ చిత్రానికి రెడీ అవుతున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రకటన రేపు అంటే నవంబర్ 7 న దీపావళి సందర్భంగా ఉంటుందని అంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. బన్నీతో సినిమా అంటే ఆరంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. క్రేజీ కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











