For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డేట్ ఫిక్స్: బన్నీ-త్రివిక్రమ్ ఇక రెగ్యులర్‌గా....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతోంది. ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ నెల 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

    Allu Arjun - Trivikram movie from 22nd

    అయోమయానికి తెర పడింది

    సినిమా ప్రారంభోత్సవం జరిగినా....షూటింగ్ మొదలు కాక పోవడంతో సినిమాపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా రద్దయిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా అల్లు అర్జున్ ‘రుద్రమదేవి' షూటింగులో జాయిన్ అయ్యారు. మరో వైపు త్రివిక్రమ్ కూడా వేరే సినిమాకు పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

    ఈ గందరగోళంతో అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటనే విషయం అర్థం కాక అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇంత జరుగుతున్నా....అటు అల్లు అర్జున్ కానీ, ఇటు త్రివిక్రమ్ కానీ, మరో వైపు నిర్మాతలు కానీ కొంత కాలం స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ మౌనం వీడారు. మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

    కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని స్పష్టం చేసారు. ఈ చిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా ఎంపికయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

    English summary
    Allu Arjun-Trivikram Srinivas combo Yet to be titled movie will be going on to floors from 22nd September for regular shooting.This Allu Arjun-Trivikram Srinivas movie was launched on 10th April 2014 in Hyderabad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X