నో పవన్ ఎఫెక్ట్: త్రివిక్రమ్, బన్నీ మూవీ డేట్ ఖరారు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'జనసేన' పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వెనక కర్త, కర్మ, క్రియ అన్నీ పవన్‌కు సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాసే అనే ప్రచారం జరిగింది. దీంతో మెగా ఫ్యామిలీ త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ ఎఫెక్ట్ త్వరలో ప్రారంభం కాబోయే బన్నీ-త్రివిక్రమ్ సినిమాపై పడుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి.
అయితే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..... త్రివిక్రమ్‌కు, జనసేన పార్టీకి అసలు సంబంధమే లేదని, నేను రాజకీయాల్లోకి రావొద్దని కోరుకున్న వారిలో త్రివిక్రమ్ కూడా ఒకరు అని తెలపడంతో ఈ వార్తలకు తెరపడినట్లయింది. కాగా త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారిగా అల్లు అర్జున్ హీరోయిన్ సమంతతో జతకట్టబోతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్ష్ బేనర్లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.
ఇక అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'రేస్ గుర్రం' ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. శృతి హాసన్ హీరోయిన్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











