మూడు భాషల్లో సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కూడా అయింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun-Trivikram movie in three languages

అయోమయానికి తెర పడింది
సినిమా ప్రారంభోత్సవం జరిగినా....షూటింగ్ మొదలు కాక పోవడంతో సినిమాపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా రద్దయిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా అల్లు అర్జున్ 'రుద్రమదేవి' షూటింగులో జాయిన్ అయ్యారు. మరో వైపు త్రివిక్రమ్ కూడా వేరే సినిమాకు పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ గందరగోళంతో అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటనే విషయం అర్థం కాక అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇంత జరుగుతున్నా....అటు అల్లు అర్జున్ కానీ, ఇటు త్రివిక్రమ్ కానీ, మరో వైపు నిర్మాతలు కానీ స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ మౌనం వీడారు. మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని స్పష్టం చేసారు. ఈ చిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా ఎంపికయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X