twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్-త్రివిక్రమ్ కొత్త మూవీ ప్రారంభం (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'జులాయి' లాంటి హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్ గా జరిగింది.

    దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సినీ ప్రముఖులు డి రామానాయుడు, సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, బండ్ల గణేష్, జెమినీ గణేష్, మారుతి, రాజకీయ ప్రముఖులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంటా శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.

    ఈ చిత్రంలో సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. సినిమా ఓపెనింగు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

    కొత్త సినిమా ప్రారంభం

    కొత్త సినిమా ప్రారంభం

    జులాయి తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రారంభం అయింది. రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

    అల్లు అర్జున్ క్లాప్

    అల్లు అర్జున్ క్లాప్

    దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ క్లాప్ కొట్టారు.

    పూజా కార్యక్రమం

    పూజా కార్యక్రమం

    సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ.

    రామానాయుడు, మారుతి

    రామానాయుడు, మారుతి

    సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామానాయుడు, అల్లు అర్జున్, త్రివిక్రమ్, మారుతి

    దిల్ రాజు

    దిల్ రాజు

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

    తమ్మారెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి

    తమ్మారెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి

    సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాద్ రెడ్డి.

    త్రివిక్రమ్, అల్లు అర్జున్

    త్రివిక్రమ్, అల్లు అర్జున్

    సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఎంతో సందడిగా సాగింది.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    జులాయి చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    గంటా శ్రీనివాసరావు

    గంటా శ్రీనివాసరావు

    సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు.

    English summary
    Allu Arjun-Trivikram new film launch. The movie Produced by Radhakrishna. Samantha lead heroine. Devisri prasad to compose the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X