పవన్‌పై అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్.. సినిమా ఫ్లాప్.. అందుకే చీప్ ట్రిక్స్ అంటూ ట్రోలింగ్
Recommended Video

గత కొద్దికాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు కనిపించాయి. అందుకు తగినట్టుగా రెండు వర్గాల మధ్య.. ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, అల్లు అర్జున్‌కు మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. కానీ ఇటీవల ఓ వివాదం కారణంగా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలందరూ ఒకే తాటిపైకి వచ్చారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది.

జనసేనకు మద్దతుగా
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తన ఇన్స్‌టాగ్రామ్‌లో సెన్సేషనల్ కామెంట్ చేశారు. జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఫోటోను పెట్టి ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

ప్రపంచం మీ వెంట
ప్రజలకు సేవ చేయాలనే మీ పిచ్చి తగినట్టుగానే జీవించింది. అందుకు తగినట్టు సర్దుకుపోయి ప్రపంచమే మీ వెంట నడుస్తుంది అని పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు.

స్టైలిష్ స్టార్ కామెంట్ బాగుంది
పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ చేసిన కామెంట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా బాగున్నది.. మంచిగా చెప్పారు.. మంచి కొటేషన్ అంటూ కొందరు స్పందించారు. అయితే మరికొందరు ప్రతికూలమైన కామెంట్లతో ట్రోల్ చేయడం కూడా కనిపించింది.

సినిమా ఫ్లాప్.. అందుకే చిప్ ట్రిక్స్
అల్లు అర్జున్ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. పవన్ అభిమానుల నుంచి సానుభూతి పొందేందుకు అలా అంటున్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











