పుష్ప 2 రిలీజ్ కు ముందు ట్రోల్స్.. అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ పై డాక్టర్ క్లారిటీ..

సినీ పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. కేవలం టాలెంట్ ఉండడమే కాదు. ఆకట్టుకునే అందం కూడా ఉండాలి. అట్రాక్ట్ చేసే అందం కోసం సినీ తారలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. తమ గ్లామర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలో నిలదొక్కొవాలంటే.. అట్రాక్ట్ చేసే అందం కూడా ఉండాలి. ఇందుకోసం సినీ స్టార్స్ తమ ఫేస్, బాడీలో మార్పులు చేయించుకోవడానికి కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అయితే తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుండి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీతో టాలీవుడ్ హీరో నుండి ఫ్యాన్ ఇండియా హీరోగా ఎదిగారు. తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించి.. జాతీయ ఉత్తమ నటుడుగా కూడా అవార్డు అందుకున్నాడు. అలాగే తన నటనతో కోట్లాదిమంది అభిమానుల ప్రేమను పొందుతున్నారు.

Allu Arjun trolled plastic surgery by a Anti-fans before the Pushpa 2 release

అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ తన అభిమానులను 'ఆర్మీ' అంటూ ప్రత్యేకంగా సంబోధిస్తూ ఉంటాడు. తాజాగా పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తూన్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రేపు అంటే డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు 12,500 థియేటర్లలో విడుదలవుతున్న పుష్ప 2 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును సృష్టించింది.

దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే 1000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే అత్యధిక వేగంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఎన్నో వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పై తాజాగా ఓ రూమర్ వస్తుంది.

అల్లు అర్జున్ తొలుత 'గంగోత్రి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలో అల్లు అర్జున్ అంత అట్రాక్ట్ గా ఏమీ లేడు. కానీ, వరుస సినిమాలు చేస్తూ.. క్యారెక్టర్ కు తగినట్లు తనను తాను మార్చుకుంటూ అల్లు అర్జున్.. అలా.. స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప2 సినిమా విడుదల నేపథ్యంలో.. యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బన్నీ పాత, కొత్త ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

అలాగే.. గతంలో ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర గొల్లు చేసిన కామెంట్స్ ను కూడా వైరల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ రాజశేఖర్ గొల్లు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారని, అందులో టాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారంటూ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే.. ఆ ఇంటర్వ్యూలో డాక్టర్ రాజశేఖర్ గళ్ళు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీల ఫోటోలను చూపిస్తూ..వీరు సర్జరీ చేసుకున్నారంటూ చూపించారు.

Allu Arjun trolled plastic surgery by a Anti-fans before the Pushpa 2 release

అందులో మొదట హీరో దుల్కర్ సల్మాన్ ఫోటోలు చూపించి పాత ఫోటోకు కొత్త ఫోటో డిఫరెన్స్ చూపిస్తూ దుల్కర్ సల్మాన్ ముక్కుకు సర్జరీ చేయించుకున్నాడని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే కూడా ముక్కు కు సర్జరీ చేయించుకున్నారని ఆమె ఫోటోలను చూపిస్తూ పేర్కొన్నారు. అనంతరం అల్లు అర్జున్ 'గంగోత్రి' సినిమా టైం ఫోటోను, లేటెస్ట్ ఫోటోను చూపించి యాంకర్ ప్రశ్నించగా దీనికి కూడా చాలా క్లారిటీ ఆన్సర్ ఇచ్చారు.

డాక్టర్ రాజశేఖర్ అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించుకున్నారని బాగా తెలుస్తుందని, అప్పటి లిప్స్ ఇప్పటి లిప్స్ కు చాలా తేడా ఉందని, నోస్, లిప్స్ కు కచ్చితంగా సర్జరీ చేయించుకుని ఉంటారని, తన అనుభవం ప్రకారం చెప్తున్నానని వెల్లడించారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అమీ జాక్సన్, శోభిత ధూళిపాల వంటి సెలబ్రిటీలు కూడా ప్లాస్టిక్ సర్జరీ పేర్కొన్నారు. వీరే కాకుండా.. చాలామంది ప్రముఖులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా తన దగ్గరికి వచ్చి ముక్కు బాగాలేదని, మూతి బాగాలేదని సర్జరీలు ,పిల్లర్స్ వంటి ట్రీట్మెంట్స్ చేయించుకున్నారని డాక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇదంతా బానే ఉన్నా కేవలం.. అల్లు అర్జున్ సర్జరీకి సంబంధించి డాక్టర్ రాజశేఖర్ చెప్పిన మాటలను మాత్రమే కట్ చేసి అల్లు అర్జున్ ఆంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X