కొడుకు కోసం అల్లు అర్జున్ కొత్త అవతారం (ఫోటోస్)
హైదరాబాద్: కొడుకు కోసం అల్లు అర్జున్ కొత్త అవతారం ఎత్తారు. కెమెరా చేతపట్టి ఫోటోగ్రాఫర్ గా మారాడు. కొడుకు ఫోటోలను కళాత్మకంగా చిత్రీకరిస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసి అభిమానులను ఎంటర్టెన్ చేస్తున్నాడు.
అల్లు అర్జున్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్. అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్ ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. రేసుగుర్రం ఆల్ టైం రికార్డ్స్ లో టాప్ 4 చిత్రంగా నిలబడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న సందర్భంలో హీరో అల్లు అర్జున్ మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్‌గా కొనప్ని రోజుల క్రితమే అయాన్ ఫొటోను విడుదల చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లురామలింగయ్య గారు ఎన్నో వందల చిత్రాల్లో నటించి నవ్వుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య మళ్లీ తమ ఇంట జన్మించినట్లు అల్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

అయాన్ ను కెమెరాలో బంధిస్తూ..
అయాన్ ఛాయా చిత్రాలను కెమెరాలో బంధిస్తూ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తిన అల్లు అర్జున్

కొడుకుతో అల్లు అర్జున్
కొడుకు అయాన్‌తో అల్లు అర్జున్....

ముద్దొస్తున్న అయాన్
అల్లు అర్జున్ కొడుకు అయాన్ చాలా ముద్దొస్తున్నాడు కదూ.

అల్లు అర్జున్, స్నేహ
పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

లవ్లీ కపుల్
స్నేహారెడ్డి అల్లు అర్జున్ ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమనిపస్తుందో తెలియదు కానీ....అల్లు అర్జున్, స్నేహా రెడ్డి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











