‘లవర్’గా మారుతున్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'లవర్'గా వెండి తెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు. జోష్ ఫేమ్ వాసు వర్మ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల దర్శకుడు అల్లు అర్జున్ కు స్టోరీలైన్ చెప్పాడని, వెంటనే బన్నీ ఓకే చేశాడని తెలుస్తోంది. తొలుత ఈ చిత్రానికి 'ప్రేమికుడు' అనే టైటిల్ అనుకున్నప్పటికీ చివరకు 'లవర్' ఫైనల్ చేశారని సమాచారం. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. జనవరి మొదటి వారంలో ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలు కాబోతోంది. హీరోయిన్, నటీనటుల ఎంపిక జరుగాల్సి ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో...'హనీ' అనే చిత్రంలో నటిస్నున్నాడు. ఇందులో బన్నీ సరసన ఇలియాన రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం 2012 ఏప్రిల్ వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. 2012 ద్వితీయార్థంలో లవర్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











