అంబరీష్ మరణం: బాధలో మోహన్ బాబు, షాకయ్యానంటూ అల్లు అర్జున్!

ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ మరణవార్త సౌత్ సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రికి రాత్రే ఈ సాడ్ న్యూస్ సౌత్ సినీ ప్రముఖులను చేరింది. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు.

అంబరీష్ అసలు పేరు మలవల్లి హుచ్చే గౌడ అమర్‌నాథ్. మైసూర్ స్టేట్‌లోని మాండ్యలో 1952 మే 29న జన్మించారు. వయసు 66 సంవత్సరాలు. తనదైన నటనతో అంబరీష్ కన్నడనాట టాప్ యాక్టర్‌గా ఎదిగారు. రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్రవేశారు. తమ అభిమాన నటుడు, నాయకుడు అంబి చివరి చూపు కోసం కన్నడ సీనీ అభిమానులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

అంబరీష్ మరణంపై పలువురు తెలుగు సినీ ప్రముఖులు స్పందించారు.

మోహన్ బాబు

నా బెస్ట్ ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్ ను కోల్పోయాను అంటూ మోహన్ బాబు బాధలో మునిగి పోయారు.

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ... ‘‘కన్నడ స్టార్ అంబరీష్ గారు ఇక లేరు. ఉదయాన్నే ఈ న్యూస్ విని షాకయ్యాను. ఆయన బంగారంలాంటి మనిషి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. సుమలతగారికి, వారి ఫ్యామిలీకి నా ప్రఘాడ సంతాపం'' అని ట్వీట్ చేశారు.

లక్ష్మీరాయ్ ట్వీట్

నటి లక్ష్మీ రాయ్ స్పందిస్తూ...‘ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి సినిమాలు చేయాలనుకున్న కల నెరవేరలేదు. కానీ ఆయన్ను పలు సందర్భాల్లో కలిసి నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయం విని షాకయ్యాను. మరో లెజెండ్ మనకు దూరం అయ్యారు' అని ట్వీట్ చేశారు.

బివిఎస్ రవి

అంబరీష్ మరణంపై తెలుగు రచయిత బివిఎస్ రవి స్పందించారు. ‘మోహన్ బాబు గారి ద్వారా పలు సందర్బాల్లో అంబరీష్ గారిని కలిశాను. ఆయన ఒక మాస్ లీడర్. ఎంతో మందికి ఆప్తుడు. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలి అన్నారు.

ఇషా రెబ్బ

అంబరీష్ మరణంపై తెలుగు హీరోయిన్ ఇసా రెబ్బ సంతాపం వ్యక్తం చేశారు. ఈ లెజెండరీ యాక్టర్ మరణం పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

శ్రీకాంత్

తెలుగు నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ అంబరీష్ మరణం కన్నడ పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

గోపీ మోహన్

అంబరీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలుగు రచయిత గోపీ మోహన్ ట్వీట్ చేశారు.

సుధీర్ బాబు ట్వీట్

అంబరీష్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ సుధీర్ బాబు ట్వీట్.

అంబరీష్

అంబరీష్

అంబరీష్ నాగరహావు అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత జలీలా అనే సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించారు. ఇప్పటి వరకు ఆయన 200 చిత్రాలకు పైగా నటించారు. అంబరీష్ చివరి చిత్రం అంబీ నింగ్ వయాస్సేథో.

నాని ట్వీట్

అంబరీష్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ నేచురల్ స్టార్ నాని ట్వీట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X