»   » ‘బాహుబలి’ గురించి అల్లు అర్జున్ ఇలా...

‘బాహుబలి’ గురించి అల్లు అర్జున్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ నెల 10 వ తేదీన విడుదల కాబోతున్న ‘బాహుబలి' చిత్రం గురించి అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సైతం ట్విట్టర్ సాక్షిగా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా తెలుగు వారి గర్వం అంటూ పొగిడారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఆయనేం ట్వీట్ చేసారో ఇక్కడ చూడండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అల్లు అర్జున్ ట్వీట్ లో ...."బాహుబలి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమాను చూడడం నిజంగా గర్వంగా ఉంది. బాహుబలి ఓ సినిమా కాదు.. అది తెలుగు సినిమా గర్వం. ప్రభాస్, రానాలు తమ కెరీర్లోనే అత్యున్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నా. తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ బాహుబలి గురించి బన్నీ ట్వీట్ చేశారు.


ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


Allu Arjun tweet about Baahubali movie

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.


English summary
Allu Arjun tweeted: " I wish the entire team of BAAHUBALI a great success. Proud to see the size of Telugu Cinema this Big. It's not just a movie it's our PRIDE"
Please Wait while comments are loading...