దర్శకులంతా తమ యూనిటీ చాటారంటూ బన్నీ ట్వీట్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరూ ఒక చోట చేరి సరదాగా గడపటం, కలిసి డిన్నర్ చేయడంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుల్లో యూనిటీ ఉందని చాటి చెప్పారంటూ ప్రశసంలు గుప్పించారు.
ఈ సమావేశం ప్లాన్ చేసింది సుకుమార్, వంశీ పైడిపల్లి.... ఇద్దరూ కలిసి చాలా మంచి పని చేశారు. అందరినీ ఒకే ఫ్రేములో చూడటం హ్యాపీగా ఉంది. రాజమౌళి, హరీష్ శంకర్, కొరటాల శివ, క్రిష్, అనిల్‌రావిపూడి, సందీప్ వంగా, నాగ్ అశ్విన్ ఈ సమావేశానికి వచ్చి తమ మధ్య ఉన్న ఐక్యతను చాటారు అని బన్నీ ట్వీట్ చేశారు.
బన్నీ సినిమాల విషయానికొస్తే... 'నా పేరు సూర్య' సినిమా తర్వాత అల్లు అర్జున్ అఫీషియల్‌గా ఏ సినిమాకు కమిట్ కాలేదు. రొటీన్ కథతో కాకుండా భిన్నమైన, బాక్సాఫీసు వద్ద బాగా వర్కౌట్ అయ్యే కథతో నెక్ట్స్ సినిమా మొదలు పెట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నారు.

'నా పేరు సూర్య' బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడినప్పటికీ..... బన్నీ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. అయితే ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో కథ ఉండక పోవడంతో అనుకున్న ఫలితాలు సాధించలేదు. అందుకే తన తర్వాతి సినిమా విషయంలో బన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











