twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ వరుడు రిలీజ్ డేట్ ఫిక్స్

    By Srikanya
    |

    అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'వరుడు' చిత్రం మార్చి 26 న రిలీజ్ కానున్నదని అధికారికంగా దర్శక, నిర్మాతలు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్‌ చుట్టు ప్రక్కల ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రం లేటెస్ట్ విశేషాలను మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ "ఈ షెడ్యూల్లో మిగిలిన కొంత టాకీని, పాటల చిత్రీకరణను పూర్తి చేస్తున్నాం. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మార్చి 26న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నామ"ని అన్నారు.

    ఇక దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ "మణిశర్మ సంగీతానికి వేటూరి సాహిత్యం అద్భుతంగా కుదిరింది. పెద్దాచిన్నా తేడాలేకుండా పాటలు అందరినీ అలరిస్తాయి. సినిమాలో నిజజీవితంలోని వంద కుటుంబాలపై కొన్ని సన్నివేశాలను చిత్రించాం. హృదయాన్ని తాకే దృశ్యాలవి" అని అన్నారు. అలాగే ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కనిపిస్తారని తెలియచేసారు. ఇక అల్లు అర్జున్ తల్లిగా సుహాసిని కనపించనుంది. సినిమాలో తొంభై శాతం వివాహం నేపధ్యంలో జరగనుంది. ఈ చిత్రం మిగతా పాత్రల్లో నరేష్‌, ఆశిష్‌ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, విజయప్రసాద్‌ తదితరులు కనిపిస్తారు. కెమెరాని ఆర్‌.డి.రాజశేఖర్‌ అందిస్తే స్టంట్స్ ని స్టన్‌ శివ, ఆర్ట్ దర్శకత్వం అశోక్‌ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X