పునీత్ రాజ్ కుమార్ ఇంటికి అల్లు అర్జున్.. అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడుగా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కానీ అతను పుష్ప ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ నుండి విరామం లేకుండా పని చేస్తున్నారు. పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత గుండెపోటుతో గత ఏడాది మరణించిన దివంగత పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే

పునీత్ రాజ్ కుమార్ మరణం
గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా బాధ పడిన పరిస్థితి కనిపించింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలు సైతం వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలకృష్ణ అయితే ఏకంగా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు కూడా పాల్గొని వారి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు

ప్రత్యేక విమానంలో
తాజాగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రత్యేక విమానంలో వెళ్లి అల్లు అర్జున్ సరాసరి నేరుగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వారి నివాసానికి వెళ్లారు. అక్కడ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్, ఆయన భార్యతో కలిసి పునీత్ చనిపోయినప్పుడు తాను ఎందుకు రాలేకపోయాను అనే విషయాన్ని వెల్లడించి, వారికి ధైర్యం కూడా చెప్పారు.

అవమానించడమే
నిజానికి అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్లో భాగంగా బెంగళూరు వెళ్లారు. ఆ సమయంలో ఆయన పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు అని అందరూ భావించారు కానీ తాను పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లడం లేదు అని అల్లు అర్జున్ వెల్లడించారు. తాను తన పనిమీద బెంగళూరు వచ్చానని ఇలాంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించడం అంటే వారిని అవమానించడమేనని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో వైరల్
పునీత్ రాజ్ కుమార్ కి నిజమైన నివాళి అంటే ఆయన కోసం ప్రత్యేకంగా వస్తాను అని అప్పుడు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తానని చెప్పుకొచ్చారు. బన్నీ అప్పుడు చెప్పినట్లుగానే గురువారం నాడు పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాక పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరకు వెళ్లి సందర్శించారు. అక్కడ పునీత్ రాజ్ కుమార్ కి అల్లు అర్జున్ నివాళులు అర్పించారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Recommended Video

త్వరలో పుష్ప 2
పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కించడానికి చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా త్వరలో పట్టాలు ఎక్కించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివర్లో విడుదల చేసి మరో హిట్ అందుకోవాలని అల్లు అర్జున్ అలాగే పుష్ప టీం భావిస్తోంది.


Click it and Unblock the Notifications











