ప్రస్తుతం హాట్ టాపిక్ గా పరిశ్రమలో చెప్పుకుంటున్న ఈ కొత్త కాంబినేషన్ నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే సాయిదేవా ప్రొడక్షన్స్ పై శానం నాగ అశోక్ కుమార్,ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు దీని నిమిత్తం విడతలు విడతలుగా చర్చలు జరిపారని విశ్వసనీయంగా తెలసింది. ఇక వరసగా రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ చేసుకుంటూ వస్తున్న వియన్ ఆదిత్య ఈ చిత్రంతో యాక్షన్ రొమాంటిక్ చిత్రాన్ని జనర్ ని ఎన్నుకున్నారని సమాచారం. అలాగే ఆయన రూపొందించిన రెయిన్ బొ త్వరలో రిలీజుకు రెడీ అవుతోంది.ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం ఆర్య-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.