అల్లు అర్జున్ 'బదిరినాధ్' లేటెస్ట్ ఇన్ఫో
అల్లు అర్జున్, వివివినాయిక్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ వారు బదిరినాధ్ అనే చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చి మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. అప్పటికి ఎన్టీఆర్ తో చేసిన అదుర్స్ ప్రమేషన్ కూడా పూర్తి కావస్తుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి చిర కాల విరామం తర్వాత చిన్ని కృష్ణ కథ అందిస్తున్నారు. మగధీర తరహాలో గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. అడ్వంచర్ బేస్ గా ఈ కధ, కథనం తయారైందని తెలుస్తోంది. ఇక ఇంతకుముందు వివివినాయిక్, అల్లు అర్జున్ కాంబినేషన్లో బన్నీ చిత్రం వచ్చి సూపర్ హిట్ కావటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఉంటాయని వాటిని రీచ్ అవటానికి తగ్గట్లుగా స్క్రిప్టుని రెడీ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హిందీ నుంచి ఓ స్టార్ హీరోయిన్ ని తెలుగుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ గెటప్ పై ప్రత్యేక దృష్టి పెట్టి క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ వేదం, వరుడు చిత్రం షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇక వినాయిక్ డైరక్ట్ చేసిన అదుర్స్ చిత్రం వెయ్యి ప్రింట్లుతో జనవరి 14 న ప్రపంచమంతటా రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











