స్టైలీష్ స్టార్ సింప్లిసిటీ చూశారా.. వీడియో వైరల్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. తన ట్యాగ్‌కు, తన పేరుకు తగ్గట్టు దర్శనమిస్తుంటాడు. ప్రతీ సినిమాకు ఏదో ఒక వేరియేషన్ చూపిస్తుంటాడు. ప్రత్యేకించి లుక్ విషయంలో సినిమా సినిమాకి ఎంతో వ్యత్యాసం ఉండేలా చూసుకుంటాడు. అందుకే అల్లు అర్జున్ స్టైలీష్ స్టార్‌గా ఇన్నేళ్లు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలుగుతున్నాడు. రీసెంట్‌గా అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు.
అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం దాదాపు 250 కోట్లు కొల్లగొట్టి అల్లు అర్జున్ కెరీర్‌లోనే టాప్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాత బన్నీ నటించబోయే ప్రాజెక్ట్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. 'పుష్ప'తో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఈ ప్రాజెక్ట్‌తోనే ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగేందుకు రంగం సిద్దం చేశాడు.

అయితే ఇప్పటికే షూటింగ్ జరగాల్సి ఉండగా కరోనాతో అంతా తారుమారైంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప చిత్రం ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్తుంది. పుష్ఫ కథకు తగ్గట్టుగా బన్నీ తన లుక్‌ను మార్చుకుంటున్నాడు. లాక్ డౌన్‌లో అదే పనిలో ఉన్న బన్నీ.. తాజాగా వాకింగ్ చేస్తూ కనబడ్డాడు. స్టైలీష్ స్టార్ అయినప్పటికీ ఎంతో సింపుల్‌గా ఓ సాధారణ పౌరుడిలా కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తూ కనబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











