దర్శక, నిర్మాతల కోసం బన్నీ వెయిటింగ్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓకే అంటే ఆయనతో చేయడానికి బోలెడు మంది దర్శకులు, నిర్మాతలు రెడీ గా ఉన్నారు... అలాంటి హీరోకు ఈ పరిస్థితి ఏమిటీ? అనుకుంటున్నారా..! అసలు వివరాల్లోకి వెళితే.... బన్నీకి తెలుగుతో పాటు మలయాళంలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ నటించిన బన్నీ, ఆర్య, హ్యాపీ, జులాయి చిత్రాలు మలయాళంలో అనువాద చిత్రాలుగా విడుదలై బాక్సీఫీసు వద్ద తన సత్తా చాటాయి. జులాయి చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ హీరో మలయాళంలోనూ ఈ చిత్రం మలయాళ అనువాదం 'గజ పోకిరి'తో అక్కడ మరింత మంది అభిమానులను ఏర్పరచుకున్నాడు.
ఇటీవల కొచ్చిలో జరిగిన 'గజ పోకిరి' చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ... తనను ఇంతలా ఆదరిస్తున్న మలయాళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు డైరెక్ట్‌గా మలయాళ చిత్రం చేయాలని ఉందని.... మంచి కథ, దర్శక నిర్మాతల కోసం వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్‌కు పెద్ద అభిమానిని అని చెప్పుకున్న బన్నీ తన భవిష్యత్ చిత్రాలను కూడా ఇదే మాదిరి ఆదరించాలని కేరళ అభిమానులను రిక్వెస్ట్ చేసాడు.


Click it and Unblock the Notifications











