పవన్ ఫ్యాన్‌ని, చిరు కారణం, చరణే నెం.1 : అల్లు అర్జున్
హైదరాబాద్ : ఇద్దరమ్మాయిలతో ఆడియో వేడుకలో ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మాకు ఈరోజు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తున్నాయంటే దానికి కారణం మెగా స్టార్ చిరంజీవి గారు. మా సినిమా మొదటి రోజే ఇంత మంది వస్తున్నారంటే దానికి కారణం ఆయనే అన్నారు.
పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం, నేను ఆయనకు అభిమానిని. ఆయన తర్వాత ఆ స్థానానికి చేరుకునేది రామ్ చరణే. వచ్చే పాతికేళ్లలో చరణ్‌ను ఇండస్ట్రీ నెం.1 హీరోగా చూడాలనేదే నా కోరిక. చరణ్ అంటే నాకు ప్రాణం. బండ్ల గణేష్ నెక్ట్స్ చరణ్‌తో తీయబోయే సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని బన్నీ తన మనసులోని మాట చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలతో మెగా అభిమానులంతా కేరింతలతో సందడి చేసారు. మెగా హీరోలు ఇండస్ట్రీలో ఎప్పుడూ టాప్ పొజిసన్లో ఉండాలని ఆకాంక్షించారు. మెగా హీరోలను పైకి తేవడానికి తమ వంతు కృషి చేస్తామని పలువురు మెగా అభిమానులు స్పష్టం చేసారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడానికైనా తాము సిద్దమని తెలిపారు.
కాగా...ఇద్దరమ్మాయిలతో చిత్రం ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, వివి వినాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈచిత్రం మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











