హరితేజకు అల్లు అర్జున్ వార్నింగ్.. ఇంతకు ఏమి జరిగిందంటే..

By Rajababu

Recommended Video

హరితేజకు అల్లు అర్జున్ వార్నింగ్ !

తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షోకు ముందు హరితేజ చిన్న చితక పాత్రల్లో నటిస్తూ అంతగా గుర్తింపులేని యాక్టర్‌గా ఉండేది. ఒక్కసారి బిగ్‌బాస్‌లో తన ప్రతిభను బయటపెట్టిన తర్వాత ఆమె కెరీర్ గ్రాఫే మారిపోయింది. టాలీవుడ్‌లో ప్రముఖ సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా టీవీషోలు, సినిమాలు, సినీ వేడుకల్లో యాంకర్‌గా రాణిస్తూ హరితేజ దుమ్ము దులిపేస్తున్నది. అలాంటి హరితేజకు ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిన్నపాటి వార్నింగ్ ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇంతకు ఏమైందటే..

 ఒక్కక్షణం స్పెషల్ గెస్ట్‌గా బన్నీ

ఒక్కక్షణం స్పెషల్ గెస్ట్‌గా బన్నీ

తన సోదరుడు నటించిన ఒక్క క్షణం చిత్రం ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అందరు యాంకర్ల మాదిరిగానే హరితేజ ఫంక్షన్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తెసింది. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అని హరితేజ తన మనసులో మాట బయటపెట్టుకొన్నది.

 హరితేజకు అల్లు అర్జున్ ప్రశంస

హరితేజకు అల్లు అర్జున్ ప్రశంస

దాంతో అల్లు అర్జున్ కూడా హరితేజపై తనకు ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. హరితేజ అద్భుతమైన నటి. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క క్షణం ఆడియో ఫంక్షన్‌ను చాలా చక్కగా హోస్ట్ చేసింది అని చెప్పాడు. ఇక అంతంటితో ఆగకుండా అల్లు అర్జున్ ఓ ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకొనేలా చేశాడు.

 హరితేజపై బన్నీ సెటైర్

హరితేజపై బన్నీ సెటైర్

అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం అని చెప్పిన హరితేజపై బన్నీ సెటైర్లు వదిలాడు. మరో సినీ వేదికపై మరో హీరో ఇష్టం అని చెబితే ఊరుకోను. అప్పుడే కచ్చితంగా మీకు ఫోన్ చేసి అడుగుతా అని బన్నీ చిన్నపాటి వార్నింగ్‌ను సరదాగా ఇచ్చాడు.

 బన్నీ వార్నింగ్‌కు హరితేజ

బన్నీ వార్నింగ్‌కు హరితేజ

బన్నీ వార్నింగ్‌ను సరదాగా తీసుకొంటూ హరితేజ తన దైన శైలిలో సమాధానమిచ్చింది. కచ్చితంగా మీరు అంటే ఇష్టం. ఏ సెంటర్లోనైనా నీ పేరే చెబుతా. మీరే నాకు ఇష్టం అని హరితేజ తియ్యగా బదులిచ్చింది. దాంతో ఆ ఆసక్తికరమైన చర్చ ముగిసింది.

బిజీ బిజీగా షోలలో హరితేజ

బిజీ బిజీగా షోలలో హరితేజ

హారితేజ‌ బిగ్‌బాస్ విజేతగా మారుతుందని అందరూ అనుకొన్నారు. కానీ అనూహ్యంగా ఆమె మూడో స్థానంతో సరిపెట్టుకొన్నది. బిగ్‌బాస్ త‌ర్వాత రాజా ది గ్రేట్ సినిమాలో ఓ చిన్నపాత్రలో క‌నిపించింది. ప్రస్తుతం జెమినీ టెలివిజన్‌లో సినీ ప్రముఖులను ఇంట‌ర్వ్యూ చేసే ఓ కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X