ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ శుభలేఖ ఒక్కొక్కటి రూ. 1250..!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం మార్చి 6 న రాత్రి పదిన్నరకు హైటెక్స్‌లో జరగనుంది. దీనికి సంబంధించి పెళ్ళి పనులు ఊపందుకున్నాయి. అల్లు అరవింద్ ఏం చేసినా పక్కా ప్లానింగ్ తో చేస్తాడు. మిగతా వాళ్ల కన్నా ఓ మెట్టు పైనుండాలనే డామినేటింగ్ ఏటిట్యూడ్ తో చేస్తాడు. అల్లు అరవింద్ మార్చి 6న జరగనున్న వాళ్లబ్బాయి హీరో అల్లుఅర్జున్ వెడ్డింగ్ కార్డులు కూడా అదే పద్ధతిలో కొట్టించాడు. ఒక పెద్ద బాక్స్ టైపులో ఈ పెళ్లి శుభలేఖల్ని అందంగా, ఆకర్షణీయంగా వేయించాడు. శుభసూచకంగా వెడ్డింగ్ కార్డులో స్వీట్స్ కూడా పెట్టారు. ఈ వెడ్డింగ్ కార్డు ఒక్కొక్కటి 1250 రూపాయలు పడిందట. ఈరోజు గీతా ఆర్ట్స్ ఆఫీసుకు సంబంధించిన పీఆర్వో ఈ వెడ్డింగ్ కార్దొకటి తెచ్చి, ప్రెస్ వాళ్లని ఫొటోలు తీసుకోమన్నాడు. అయితే, ఈ కాస్ట్ లీ వెడ్డింగ్ కార్డులు VVIP ల కోసమేనట!
More from Filmibeat
అల్లు అర్జున్ స్నేహా రెడ్డి వెడ్డింగ్ కార్డు అల్లు అరవింద్ బద్రీనాథ్ allu arjun sneha reddy wedding card allu aravind


Click it and Unblock the Notifications











