అల్లు అర్జున్ ని పెళ్లికొడుకుని చేసిన చిరు - డాన్స్ చేసిన చరణ్...!

By Sindhu

అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీని పెళ్లి కొడుకును చేసారు. పెళ్లికొడుకు తండ్రి అల్లు అరవింద్‌ స్వగృహంలో ఈ వేడుక అత్యంత ఆత్మీయులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. బన్నీ మేనత్త శ్రీమతి సురేఖాచిరంజీవి దగ్గరుండి ఈ వేడుకను జరిపించారు. చిరంజీవి, రామ్ చరణ్‌ తేజ్‌ తదితరులు హాజరయ్యారు. మరో మూడు రోజుల్లో బన్నీ పెళ్లి హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో స్నేహారెడ్డితో అంగరంగవైభవంగా జరిపించేందుకు సన్నాహాలు జరుగుతుండడం తెలిసిందే.

కాగా ఈ మధ్య హైదరాబాదు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లలో చాలా మంది ఇళ్లల్లో పెళ్లికి ముందు 'సంగీత్' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు స్నేహితులు, బంధువులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాదు... ఈ 'సంగీత్' లో ఆడా మగా తేడా లేకుండా అందరూ పాప్యులర్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. ఇందుకోసం కొంతమంది సినిమా డ్యాన్స్ మాస్టర్ల నేతృత్వంలో రిహార్సల్స్ కూడా చేస్తుంటారు.

ఇక విషయానికొస్తే... నిన్న మామయ్య చిరంజీవి, బావ రామ్ చరణ్ ల సమక్షంలో 'పెళ్లి కొడుకు'గా మారిన బన్నీ (అల్లు అర్జున్) ఈ 'సంగీత్' కార్యక్రమాన్ని ఈరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ రాత్రి (మార్చి 3) వాళ్ళింట్లో జరిగే ఈ కార్యక్రమంలో చరణ్, పవన్, రాణా వంటి తారలతో బాటు చిరు కూడా కొన్ని నంబర్లకి సరదాగా డ్యాన్స్ చేస్తారట! సో.... అల్లు వారింట ఈ రోజు డ్యాన్సుల పోటీయే అన్న మాట!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X