»   » అల్లు అర్జున్ వివాహం లైవ్ గా చూడాలంటే ఆ ఛానెల్ లో ...

అల్లు అర్జున్ వివాహం లైవ్ గా చూడాలంటే ఆ ఛానెల్ లో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ వివాహంని మా మూవీస్ లో లైవ్ టెలీకాస్ట్ ఇస్తున్నారు.మార్చి ఆరవ తేదీ రాత్రి ఏడున్నర గంటల నుంచి ఈ ప్రసారం ప్రారంభం కానుంది. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ఇలా ఓ హీరో వివాహాన్ని లైవ్ టెలీకాస్ట్ ఇవ్వటమనేది రికార్డుగా చెప్తున్నారు. ఇక ఇంటర్నెట్ ద్వారా ఈ వివాహాన్ని వీక్షించాలనుకునేవారికి యూ ట్యూబ్ లో మా టీవీ అఫీషియల్ ఛానెల్ ద్వారా రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి ప్రారంభమవుతుంది.

ఇక ఈ సందర్భంగా మార్చి 8న అభిమానుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ను అల్లు అరవింద్ కుటుంబం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్త అభిమానులు పాల్గొననున్నారు. వీరికోసం ప్రత్యేకంగా మధ్యాహ్న విందును ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.

English summary
Allu Arjun’s wedding will be live telecast on MAA Movies channel from 7:30 pm on the night of 6th March 2011. For the 
 
 first time in the history of Telugu cinema, an actor’s wedding is being telecast live on TV. The users on internet can 
 
 also watch the same on MAA Tv’s official channel in youtube from 8:30 pm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu