అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి గాయాలు
ఆసుపత్రికి అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ తదితరులు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదం జరిగినపుడు అల్లు అర్జున్ ఆమె వెంట ఉన్నట్లు సమాచారం. ప్రమాద విషయాన్ని ఆయనే మీడియాకు తెలిపారు . ఇక ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' క్రిందటి వారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ . చిత్రం నిర్మాత గణేష్ మాట్లాడుతూ -''పూరి అన్ని చిత్రాల్లోకెల్లా ఇది వ్యత్యాసంగా ఉంటుంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అరవింద్‌గారిని అడుగుతున్నాను. బన్నీ నా రోల్ మోడల్. చాలా కష్టపడతాడు. 'నాయక్' కోసం అమలాపాల్ చేసిన డాన్స్ చూశాను. బ్రహ్మాండంగా చేసింది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నాను. నిర్మాతగా నా కెరీర్ ఆయనతోనే మొదలుకావాల్సింది. ఇప్పటికి కుదిరింది. వచ్చే నెల తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామ'' అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.


Click it and Unblock the Notifications












