పుష్ప 2 పై దెబ్బ పడటం ఖాయం.. అల్లు అర్జున్, అరవింద్‌పై పాపులర్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీలో విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, అతని సతీమణి స్నేహారెడ్డిలను మరో మెగా హీరో సాయిధరమ్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో అన్‌ఫాలో చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. '' చెప్పను బ్రదర్ '' ఇన్సిడెంట్‌తో స్టార్ట్ అయిన అల్లు అర్జున్ vs మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్ నిన్నటి ఏపీ ఎన్నికల్లో తారాస్థాయికి చేరిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బన్నీ విషయంలో తమ వైఖరి ఏంటో చూపించేందుకే సాయితేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ ఈ హెచ్చరిక పంపిందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇది కేవలం సాయిధరమ్ తేజ్ వ్యక్తిగత నిర్ణయమా అన్న దానిపై క్లారిటీ లేదు.

మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలపై దర్శకుడు గీతాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసరేనని కానీ.. రాజకీయాలు, చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ ఒక బచ్చా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత అరవింద్ కూడా సాధారణ ప్రొడ్యూసరేనని, కానీ చిరంజీవి లాంటి ఒక బంగారు బాతు దొరకడంతో ఆ గుడ్లు అమ్ముకుంటూ పైకొచ్చాడని గీతా కృష్ణ అన్నారు. ఈ పెద్దల నెక్ట్స్ జనరేషన్‌లో స్వార్ధం ఏర్పడటం సహజమని.. అల్లు అర్జున్ మంచి నటుడు కావడం వల్ల రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లో కాంపీటిషన్ ఉంటుందన్నారు.

allu arjun will face negative effect on pushpa 2 says director geetha krishna

ప్లాన్డ్‌గా చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ కావడం, పాన్ ఇండియా స్టార్‌డమ్ ఆ వెంటనే తెలుగు హీరోలలో ఎవరికీ లేని , రానీ నేషనల్ అవార్డ్ రావడంతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్లిపోయాడని గీతాకృష్ణ తెలిపారు. అల్లు అరవింద్ విధానాలు పవన్‌కు నచ్చకపోవడంతో వారి మధ్య గ్యాప్ ఉంది .. అలాగే పవన్‌ను చిన్నప్పటి నుంచి చులకనగా చూసేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అల్లు అరవింద్ బోల్డంత వెనకేసుకున్నాడని.. అయితే తన తండ్రితో పవన్ వ్యవహరించే తీరు మనసులో పెట్టుకున్నాడని ఆరోపించారు.

పుష్ప-2పై ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని గీతా కృష్ణ జోస్యం చెప్పారు. ఎప్పుడో పబ్‌లో పరిచయమైన శిల్పా రవి కోసం .. ఫ్రెండ్ అని బన్నీ ఎగేసుకుంటూ వెళ్లాడని మండిపడ్డారు. పదేళ్ల నుంచి కష్టపడుతున్న పవన్‌కి ఒక ఫ్యామిలీ మెంబర్‌గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌పై ఉందని గీతాకృష్ణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో గేమ్ ఛేంజర్ అవుతాడని బహుశా బన్నీ సైతం ఊహించి ఉండడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోయారని గీతాకృష్ణ తెలిపారు.

allu arjun will face negative effect on pushpa 2 says director geetha krishna

ఈ పరిణామాల నేపథ్యంలో పుష్ప-2ని తెరకెక్కిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫెక్ట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఓ సినిమాను మెగాభిమానులు పట్టించుకోకపోగా.. సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ చేశారన్నది బహిరంగ రహస్యం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఛరిష్మా, పరపతి శిఖరాగ్రాన్ని చేరింది. అమరావతి నుంచి ఢిల్లీ దాకా తను చెప్పినట్లు వినే ప్రభుత్వాలు , లక్షలాది మంది అభిమాన గణం పవన్ సొంతం. ఇలాంటి పరిస్ధితులను ముందు ఊహించక బన్నీ అనవసరంగా మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌తో వైరం కొనితెచ్చుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జరిగిందేదో జరిగింది .. గతాన్ని పక్కనపెట్టి అల్లు అర్జున్ దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X