వెస్ట్ గోదావరికి వెళ్లనున్న అల్లు అర్జున్.. కారణం ఏంటో తెలుసా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఎట్టకేలకు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నా పేరు సూర్య చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో బన్నీ బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు సరైన కథ కోసం ఎదురుచూశాడు. అల్లు అర్జున్ కు ఫ్యామిలీ, సినిమాలు తప్ప లేదు. ఎప్పుడు తీరిక సమయం దొరికినా కుటుంబ సభ్యలతో, పిల్లలతో సమయం గడుపుతుంటాడు. తాజాగా అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వార్త వస్తోంది.

వెస్ట్ గోదావరి జిల్లాకు
మెగా ఫ్యామిలీకి పశ్చిమ గోదావరి జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. అల్లు అరవింద్, చిరంజీవి సొంత ఊర్లు అయిన పాలకొల్లు, మొల్తూరు ఉండేది ఈ జిల్లాలోనే. ఈ సంక్రాంతి తన కుటుంబానికి మరచిపోలేని అనుభూతి అందించాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. అందుకోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

పండుగ వాతావరణం
ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి ఎలా ఉంటుందో తన పిల్లలకు చూపించాలని అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ పాలకొల్లుకు వెళ్లబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ న్యూ ఇయర్ వెకేషన్ కోసం కుటుంబ సభ్యులతో లెబనాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో ప్రారంభం
త్రివిక్రమ్ దర్శత్వంలోని చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆలు అర్జున్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్ లో అల్లు అరవింద్, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఇతర విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

త్రిభాషా చిత్రంగా ప్రేమకథ
మరో వైపు గీత గోవిందం దర్శకుడు అల్లు అర్జున్ కోసం ఓ ప్రేమ కథని సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ చిత్రణ తెలుగు, తమిళ, మలయాళీ త్రిభాషా చిత్రంగా తెరకెక్కిస్తారట. ఇప్పటి వరకు ఇది జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











