అల్లు అర్జున్ విష్ చేస్తూ ట్వీట్

By Srikanya

హైదరాబాద్‌: అల్లు అర్జున్ కు ,దర్శకుడు మారుతి మంచి అనుబంధం ఉంది. ఈ నేపధ్యంలో ఆయన మారుతి చిత్రాల పంక్షన్స్ కు హాజరవటం చేస్తూండటం,సపోర్ట్ చేయటం చేస్తారు. అంతేకాక తాజాగా ఆయన తమ సొంత బ్యానర్ తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా మారుతి దర్శకుడుగా రూపొందే చిత్రానికి సపోర్ట్ గా నిలిచారు.

నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ట్రైలర్‌ను సైతం మంచి ఆదరణ పొందుతోంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.

ఈ సందర్భంగా ఈ చిత్రం డైలాగ్ ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని, క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రాలకు తీసిపోకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, డాల్బీ అట్మాస్ సిస్టమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.

నటించడానికి వీలున్న ఓ మంచి పాత్ర ఈ సినిమాలో దొరికిందని, నిర్మాత సినిమాను క్వాలిటీగా రూపొందించారని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్‌కు వెళ్లి, చూసి నవ్వినవ్వి రావచ్చనినాని తెలిపారు.

Allu Arjun wishes Nani's Bhale Bhale Magadivoi team

కెమెరా పనితనం సరికొత్తగా వుందని, ఈ చిత్రంలో ప్రతి పాత్ర నవ్విస్తూనే వుంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు మారుతి తెలిపారు.

మతిమరుపు కుర్రాడిగా నాని నటించిన పాత్ర సరికొత్తగా ఉంటుందని, పూర్తి కమర్షియల్ విలువలతో ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా వచ్చేనెల 4న థియేటర్లలో విడుదలవుతుందని నిర్మాత బన్నీవాసు తెలిపారు.

ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యువతనూ అలరిస్తుందని హీరో నాని హామీ ఇస్తున్నాడు. సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో నాని చిన్నపాటి ప్రమాదానికి గురైనా... వెంటనే షూటింగ్ లో పాల్గొని ఎంతో సహకరించాడని డైరెక్టర్ మారుతీ కితాబిచ్చాడు.

Allu Arjun wishes Nani's Bhale Bhale Magadivoi team

'ఈ రోజుల్లో', 'బస్టాప్'తో అడాల్ట్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ 'కొత్త జంట'తో ఆ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేశాడు కానీ, పెద్దంత సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రం అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'భలే భలే మొగాడివోయ్' ను అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ గా మారుతీ తెరకెక్కిస్తున్నాడట.

విశేషం ఏమంటే... ఇంతవరకూ తన సినిమాలకు జెబితోనే మ్యూజిక్ చేయించుకున్న మారుతీ ఇప్పుడు మలయాళంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో గోపీ సుందర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 'అందాలరాక్షసి', 'దూసుకెళ్తా' చిత్రాల్లో నటించిన అయోధ్య చిన్నది లావణ్య త్రిపాఠి సైతం మంచి విజయం కోసం ఎదురు చూస్తోంది!

మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X