సైరా కోసం బన్నీ.. ఏఎంబీలో ఫ్యామిలీతో ప్రత్యక్షం
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను తిరగ రాసేందుకు సిద్దమైంది. అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి పాజిటివ్ కామెంట్లు వస్తుండగా.. తెలుగు నాట సైరా వీర విహారం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. సైరా ఫీవరే నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు సినిమాను చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మెగా హీరోలైతే సినిమాను చూసి ఆనందంలో మునిగిపోతున్నారు. 'బాస్' బస్టర్ హిట్ అంటూ కామెంట్లు పెట్టేశారు. సైరా ఘన విజయం సాధించినందుకు మెగా హీరోలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ కాస్త ఆలస్యంగా సినిమాను వీక్షిస్తున్నాడు.

నేటి సాయంత్రం ఏఎంబీ థియేటర్స్లో సైరా సినిమాను చూసేందుకు వెళ్లారు. ఫ్యామిలీతో సహా ప్రత్యక్షమయ్యే సరికి అక్కడి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. త్రివిక్రమ్ తో చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉండటం, కొత్త ఇంటిని నిర్మించే పనిలో నిమగ్నమవడంతో సైరా ను మొదటి రోజే చూడలేకపోయాడని సమాచారం. నేటి సాయంత్రం సినిమా చూసేందుకు వెళ్లిన బన్నీ.. ఏ విధంగా ఎమోషనల్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











