గర్భవతైన భార్యతో అల్లు అర్జున్(ఫొటో)

By Srikanya

Allu Arjun with his pregnant wife Sneha!
హైదరాబాద్: మొత్తానికి అల్లు అర్జున్‌ తను తండ్రి కాబోతున్నాడనే విషయం కన్ఫర్మ్ చేస్తూ అభిమానులకు ఆనందం కలిగించటానికి నిర్ణయించుకున్నాడు. ఈ మేరుకు ఆయన తన సతీమణి స్నేహారెడ్డి తో కలిసి తీయించుకున్న ఫోటోని తనే స్వయంగా ఆన్ లైన్ లో ఫ్యాన్స్ కు అందించాడు. గతంలో ఈ విషయమై రూమర్స్ ప్రచారంలోకి వస్తే అల్లు అరవింద్ వాటిని ఖండించారు.

ఫోటో ను షేర్ చేస్తూ బన్నీ ఇలా రాసారు... " Having a baby is like falling in love again, with your wife and child.Cutie, come soon,".

ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X