అల్లు అర్జున్ మళ్ళీ అదే డైరక్టర్ కి గ్రీన్ సిగ్నాల్
అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గతంలో పరుగు చిత్రం వచ్చి యావరేజ్ అయ్యింది. అయినా అదే దర్శకుడుకి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా భాస్కర్ కలిసి ఓ స్టోరి లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు. నిజానికి కార్తితో భాస్కర్ ఆ చిత్రం చేయాలని ప్లాన్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.నవంబర్ మొదటి వారం నుంచి త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుంది. ఇక ఈ చిత్రాలతో పాటు దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే చేసాడు. ఇక ప్రస్తుతం నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ....ఎన్టీఆర్ తో ఊసరవిల్లి చిత్రం నిర్మిస్తున్నారు. పరిస్థితులకి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని సక్రమ మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది 'ఊసరవెల్లి' లోని ప్రధానాంశం. ఎవరూ ఊహించని మలుపులతో నడిచే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్‌ప్లే ప్రధానాకర్షణ.
'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











