బన్నీకి రైట్ ఆప్షన్ గౌతమ్ మీనన్ !
సుకుమార్, వినాయక్, కరుణాకరన్, పూరీ జగన్నాథ్, భాస్కర్, గుణశేఖర్, క్రిష్, ఇలా కోరుకున్న ప్రతి దర్శకుడి తోనూ సినిమాలు చేస్తూ వస్తోన్న అల్లు అర్జున్ ఈసారి ఏకంగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చెయ్యాలని తహతహలాడుతున్నాడట. ఆశ పడ్డ దర్శకుడిని 'అల్లు"కుపోయి తీసుకువచ్చెయ్యగల తండ్రి అరవింద్ అండ వుండనే వుంది కనుక బన్నీ కోరిక త్వరగానే తీరే అవకాశాలున్నాయి.
ఇంతకీ బన్నీ బాబు గౌతమ్ మాయలో పడింది 'ఏ మాయ చేశావె" చూసి మాత్రమే కాదండోయ్..ఆల్ రెడీ మలయాళంలో మార్కెట్ సంపాదించుకున్న బన్నీకి తమిళ్ లోనూ తెరంగేట్రం చేసెయ్యాలని చాలా ఉబలాటంగా ఉంది. అందుకు గౌతమ్ మీననే రైట్ ఆప్షన్ అని అల్లు అర్జున్ అభిప్రాయం.
అల్లు అర్జున్ గౌతమ్ మీనన్ అల్లు అరవింద్ ఏ మాయ చేశావె బద్రీనాథ్ allu arjun gautham menon allu aravind ye maya chesave badrinath


Click it and Unblock the Notifications