Pushpa 2 రాజమౌళి, షారుక్ రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప: ది రూల్ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు తిరుగరాస్తున్నది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీ తగ్గేదేలే అంటూ ఇండియాను ఏకం చేసింది. క్రికెటర్లు, క్రీడాకారులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఈ సినిమాలోని డైలాగ్స్‌తో హోరెత్తించారు. అలాంటి సంచలన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 మూవీ బిజినెస్ పరంగా రికార్డులు తిరగరాస్తున్నది. థియేట్రికల్, డిజిటల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాపై ఆకాశమంత అంచనాలు పెట్టుకొన్నారు. అంచనాలను రెండు, మూడింతలు చేస్తూ గ్లింప్స్, టీజర్లు, లుక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ లుక్‌ అమాంతం ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Allu Arjun s Pushpa 2 breaks all records Theatrical Rights of North India business

అయితే పుష్ప2 సినిమా విషయానికి వస్తే.. ఆడియో రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు వార్తలు వచ్చాయి. మ్యూజిక్ రైట్స్ హక్కులను సుమారుగా 60 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందనే న్యూస్ ట్రేడ్ వర్గాలకు షాకింగ్ కలిగించింది. ఇక అంతటితో ఆగకుండా ఇతర బిజినెస్‌లు జరుగుతున్న చూస్తే.. రికార్డు అనే మాట వాడటం చాలా తక్కువగా అనిపిస్తుందనే చెప్పాలి.

ఇక పుష్ప: ది రూల్ సినిమా ఇటీవల డిజిటల్ రైట్స్ బిజినెస్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ అమ్మకాలు జరిగిన తీరు ఆల్ టైమ్ రికార్డుగా చెప్పకొంటున్నారు. ఈ సినిమా అన్ని భాషల హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్నది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. పుష్ప2 ఓటీటీ రైట్స్ సుమారుగా 275 కోట్ల రూపాయల మేర జరిగింది అని తెలిసింది.

Allu Arjun s Pushpa 2 breaks all records Theatrical Rights of North India business

అలాగే తాజాగా అల్లు అర్జున్ సినిమా ఇటీవల థియేట్రికల్ బిజినెస్‌ను కూడా కొంత వరకు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాను నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ అనిల్ తడానీ సుమారుగా 200 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం. ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

పుష్ప 2 బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమా బిజినెస్ లెక్కలు పాన్ ఇండియా మూవీని మించి జరుగుతుండటం ట్రేడ్ వర్గాలకు అంతుచిక్కని వ్యవహారంగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X