బన్నీ ‘పకడో’ మ్యూజిక్ వీడియో ఫస్ట్ లుక్
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జులాయి. ఈచిత్రానికి సంబంధించిన 'పకడో పకడో' మ్యూజిక్ వీడియో ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ వీడియోలో బన్నీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా కనిపించనున్నారు. ఇటవలే ఈ పాట చిత్రీకరణ చార్మినార్ సమీపంలోని 'ఝా ఖుర్షిద్ దేవ్‌డి' కాలేజీలో చిత్రీకరించారు.
ఈ వీడియో కేవలం సినిమా ప్రమోషన్ల కేసమే చిత్రీకరించారు. చిత్రంలో దేవిశ్రీ, బన్నీతో కూడిన ఈ సాంగు ఉండదని తెలుస్తోంది. ఈ వీక్ ఈ వీడియో విడుదల కానుంది. మాంచి మాస్ మసాలా ట్యూన్, అదరిపోయే డాన్స్ స్టెప్పులతో రూపొందించిన ఈ పాట సినిమాపై మంచి అంచనాలు పెంచి ఓపెనింగ్స్ రాబడతాయని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.
ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుండగా రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











