»   » అల్లు అర్జున్‌పై యాక్సిడెంట్ రూమర్లు, అసలు నిజం ఇదీ...

అల్లు అర్జున్‌పై యాక్సిడెంట్ రూమర్లు, అసలు నిజం ఇదీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ యాక్సిడెంట్ కు గురయ్యాడని, గాయపడ్డాడని, అందుకే ఆసుపత్రికి వెళ్లాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చారు.

అయితే ఈ వార్తలను అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఖండించారు. బన్నీ ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని స్పష్టం చేసాడు. తన భార్యకు స్నేహకు మైనర్ సర్జరీ ఉండటం వల్లనే ఆమెతో కలిసి బన్నీ ఆసుపత్రికి వెళ్లినట్లు స్పష్టం చేసారు. అల్లు అర్జున్ వివరణతో అభిమానులు కూల్ అయ్యారు. స్నేహ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Allu Arvind denied Bunny accident rumors

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
Rumours of Allu Arjun meeting with an accident during the shooting of an action sequence have been doing the rounds on social media. Bunny’s father and senior producer Allu Arvind denied these rumors.
Please Wait while comments are loading...