కోట శ్రీనివాస్‌కు అల్లు రామలింగయ్య అవార్డు

ప్రతి ఘటన చిత్రం ద్వారా చలన చిత్రరంగంలోకి ప్రవేశించిన కోట... అహనా పెళ్లంట, చిత్రం భళారే విచిత్రం, శత్రువు, ఆమె, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పృధ్వినారాయణ, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో మొదలగు చిత్రాలలో విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రలు ధరించి ఎన్నో అవార్డులు అందుకుని తెలుగుతో పాటు ఇతర భాషల్లో దాదాపు 300 చిత్రాలలో ప్రఖ్యాతిగాంచారు.
గతంలో ఈ పురస్కారాన్ని తమిళ నటి మనోరమ, తెలుగు కమెడియన్ బ్రహ్మానందం, హిందీ నటుడు జానీ లీవర్, రాజేంద్రప్రసాద్, కె. విశ్వనాథ్, పద్మనాభం, ఇవివి సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, తనికెళ్ల భరణి తదితరులకు ప్రదానం చేసారు. ఈ సారి ఈ అవార్డు కోట శ్రీనివాస్‌కు ప్రదానం చేయబోతున్నారు.
ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో కోటకు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా కోటను స్వర్ణ కంకణంతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమం సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరుగనుంది.


Click it and Unblock the Notifications











