twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోట శ్రీనివాస్‌కు అల్లు రామలింగయ్య అవార్డు

    By Bojja Kumar
    |

    Kota Srinivasa Rao
    హైదరాబాద్: పద్మశ్రీ, డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అల్లు రామలింగయ్య జన్మదినం సందర్భంగా ప్రదానం చేసే 'పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం' 2013 సంవత్సరానికి గాను ప్రఖ్యాత చలన చిత్ర నటుడు కోట శ్రీనివాసరావుకు ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించింది.

    ప్రతి ఘటన చిత్రం ద్వారా చలన చిత్రరంగంలోకి ప్రవేశించిన కోట... అహనా పెళ్లంట, చిత్రం భళారే విచిత్రం, శత్రువు, ఆమె, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పృధ్వినారాయణ, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో మొదలగు చిత్రాలలో విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రలు ధరించి ఎన్నో అవార్డులు అందుకుని తెలుగుతో పాటు ఇతర భాషల్లో దాదాపు 300 చిత్రాలలో ప్రఖ్యాతిగాంచారు.

    గతంలో ఈ పురస్కారాన్ని తమిళ నటి మనోరమ, తెలుగు కమెడియన్ బ్రహ్మానందం, హిందీ నటుడు జానీ లీవర్, రాజేంద్రప్రసాద్, కె. విశ్వనాథ్, పద్మనాభం, ఇవివి సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, తనికెళ్ల భరణి తదితరులకు ప్రదానం చేసారు. ఈ సారి ఈ అవార్డు కోట శ్రీనివాస్‌కు ప్రదానం చేయబోతున్నారు.

    ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో కోటకు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా కోటను స్వర్ణ కంకణంతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమం సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరుగనుంది.

    English summary
    Allu Rama Lingaiah national award 2013 to Kota Srinivasa Rao. Allu Ramalingaiah National award has been instituted in the year 2004 in his memory to be given to best comedians/actors/film personalities every year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X